Share News

Vasim Shaikh: ఇద్దరు యువతులతో ప్రేమ, పెళ్లి

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:04 AM

చిత్రదుర్గ పట్టణంలోని జేజేహట్టి కాలనీకి చెందిన వసీం షేక్‌(28) అనే యువకుడు ఇద్దరు యువతులను ఒకేసారి, ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు.

Vasim Shaikh: ఇద్దరు యువతులతో ప్రేమ, పెళ్లి

  • చిత్రదుర్గలో ఒకే వేదికపై వివాహం

బెంగళూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): చిత్రదుర్గ పట్టణంలోని జేజేహట్టి కాలనీకి చెందిన వసీం షేక్‌(28) అనే యువకుడు ఇద్దరు యువతులను ఒకేసారి, ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు. వసీం గతంలో గోవాలో పనిచేసే సమయంలో షిఫా అనే యువతితో స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత జన్నత్‌ అనే చిత్రదుర్గ యువతితో స్నేహం ఏర్పడి అది కూడా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరితోనూ వసీం ప్రేమ కొనసాగించాడు. ప్రేమిస్తున్న ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మూడు కుటుంబాలవారూ ఈ విషయమై చర్చించి వివాహానికి అనుమతించడంతో ఇద్దరినీ వసీం వివాహం చేసుకున్నాడు. ఈ నెల 15న ఎంకే ప్యాలె్‌సలో రిసెప్షన్‌ (వలీమా) జరుపుకొన్నారు. కాగా.. ఇద్దరితో వివాహం గురించి వసీం మీడియాతో మాట్లాడుతూ.. 13 ఏళ్ల క్రితం షిఫాతో, ఏడేళ్ల క్రితం జన్నత్‌తో పరిచయం ఏర్పడిందని, స్వచ్ఛమైన ప్రేమతోనే పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. తమ వివాహాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని తెలిపాడు.

Updated Date - Oct 19 , 2025 | 03:04 AM