Share News

Mumbai: ప్రయాణికుడి పొట్టలో 67 కొకైన్‌ క్యాప్సూల్స్‌

ABN , Publish Date - Jun 23 , 2025 | 05:09 AM

తన పొట్టలోనే మాదక ద్రవ్యాలను దాచుకొని స్మగ్లింగ్‌ చేసిన విమాన ప్రయాణికుడిని అరెస్టు చేసినట్టు ఆదివారం ముంబైలోని రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలిపారు.

Mumbai: ప్రయాణికుడి పొట్టలో 67 కొకైన్‌ క్యాప్సూల్స్‌

  • విలువ రూ.11 కోట్లు ముంబైలో నిందితుడి పట్టివేత

ముంబై, జూన్‌ 22: తన పొట్టలోనే మాదక ద్రవ్యాలను దాచుకొని స్మగ్లింగ్‌ చేసిన విమాన ప్రయాణికుడిని అరెస్టు చేసినట్టు ఆదివారం ముంబైలోని రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలిపారు. ఐవరీకోస్ట్‌ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 19న సియెర్రాలియోన్‌ నుంచి ముంబై వస్తూ పొట్టలో 67 కొకైన్‌ క్యాప్సూల్స్‌ను దాచుకున్నాడు. వాటి బరువు 1,139 గ్రాములు, విలువ రూ.11.39 కోట్లు. అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా కొకైన్‌ను స్మగ్లింగ్‌ చేస్తున్నట్టు అంగీకరించాడు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వాటిని బయటకు తీశారు.

Updated Date - Jun 23 , 2025 | 05:09 AM