Share News

BIG BREAKING: లొంగిపోయిన మల్లోజుల.. సీఎం ఎదుట ఆయుధాల సమర్పణ

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:06 AM

సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో, సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అధికారికంగా పోలీసులకు లొంగిపోయారు.

BIG BREAKING: లొంగిపోయిన మల్లోజుల.. సీఎం ఎదుట ఆయుధాల సమర్పణ
mallojula

సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో, సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్‌ అభయ్‌ అధికారికంగా పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలో ఈ మేరకు మల్లోజులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాలు అప్పగించారు. మల్లోజుల, ఆయన బృందాన్ని సీఎం ఫడణవీస్‌ జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించారు.


మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలను మల్లోజుల అందించారు. దాదారు రూ.6 కోట్ల రివార్డు మల్లోజులపై ఉండటంతో రివార్డును ఆయనకు సీఎం ఫడ్నవీస్‌ అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో మోస్ట్‌వాంటెడ్‌గా మల్లోజులు ఉన్నారు. మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు విడుదల చేస్తూ వచ్చారు. పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని తెలుపుతూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి తప్పుకున్నారు. మల్లోజుల వేణుగోపాల్‌రావుపై వందకు పైగా కేసులు ఉన్నాయి. నిన్న 60 మంది మావోయిస్టులతో కలిసి మల్లోజుల లొంగిపోయిన విషయం తెలిసిందే.


తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు మల్లోజుల వేణుగోపాల్‌రావు మూడో సంతానంగా జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే మల్లోజుల పోరాట స్ఫూర్తిని అలవర్చుకున్నారు. చదువు పూర్తి చేసుకున్న తరువాత తన అన్న పిలుపు మేరకు మావోయిస్టు ఉద్యమంలో ప్రవేశించారు. పార్టీలో ఆయనను అభయ్, సోను, భూపతి, వివేక్‌ పేర్లతో పిలిచేవారు.


ఇవి కూడా చదవండి:

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి ఏమీ లేదులే..

Jubilee Hills By Poll: ఊపందుకోనున్న నామినేషన్లు.. నేడే బీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్

Updated Date - Oct 15 , 2025 | 01:22 PM