Maharashtra Governor: సరైన సమయంలో పాక్‌కు గుణపాఠం
ABN , Publish Date - Apr 28 , 2025 | 05:01 AM
మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన పాకిస్థాన్‌కు సరైన సమయంలో గుణపాఠం నేర్పుతామని చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంపై ఆయన విమర్శలు చేసినారు. గవర్నర్ల నియామక విషయంలో సుప్రీంకోర్టు తీర్పులలో తారతమ్యాలు ఉన్నాయని, వాటిపై న్యాయనిపుణులతో చర్చించి పరిష్కరించాలని అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్
చెన్నై, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులతో కాల్పులు జరిపించిన పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతుందని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. బంగ్లాదేశ్‌ను పోగొట్టుకున్నప్పకీ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే పనిగా పెట్టుకుందని అన్నారు. మరోవైపు, గవర్నర్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు వేర్వేరుగా ఉన్నాయని, ఉప కులపతులను నియమించుకునే అధికారం కేరళ గవర్నర్‌కు ఉందని తెలిపిన సుప్రీంకోర్టే.. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌కు ఆ అధికారం లేదంటూ తీర్పు వెలువరించిందని తెలిపారు, ఈ తారతమ్యాలపై న్యాయనిపుణులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఊటీలో గవర్నర్ ఏర్పాటు చేసిన సదస్సుకు వీసీలను వెళ్లకుండా బెదిరించారనే ఆరోపణలపై రాధాకృష్ణన్ స్పందిస్తూ తమిళనాట బెదిరింపులు సర్వసాధారణమని, వీసీలకు మినహాయింపు లేదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News