Maharashtra Baba: రోగాలు నయం చేస్తానంటూ బాబా దారుణం..
ABN , Publish Date - Jul 20 , 2025 | 01:48 PM
Maharashtra Baba: దెయ్యాల్ని వదిలిస్తానని, పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లు అయ్యేలా చేస్తానని, పిల్లలు పుట్టని వారికి సంతానం కలిగేలా చేస్తానని, రోగాలు నయం చేస్తానని ప్రచారం చేసుకున్నాడు. అతడ్ని నమ్మి వచ్చిన వారిని బాగా కొట్టేవాడు.
శాస్త్రసాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలోనూ ప్రజల్లో మూఢ నమ్మకాలు మాత్రం చావటం లేదు. కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. పూజల పేరిట అమాయక జనాల్ని హింసిస్తున్నారు. తాజాగా, మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో దొంగ బాబా దారుణాలు బయటపడ్డాయి. ఆ బాబా పూజల పేరుతో ప్రజల్ని హింసిస్తున్నాడు. తన దగ్గరకు సమస్యలతో వచ్చే వారిని కొట్టడమే కాకుండా వారితో బలవంతంగా తన మూత్రాన్ని తాగిస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సంజయ్ పగారే అనే వ్యక్తి బాబాగా అవతారం ఎత్తాడు. శియూర్ గ్రామంలోని గుడిలో తన ఆశ్రమాన్ని ఓపెన్ చేశాడు. దెయ్యాల్ని వదిలిస్తానని, పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లు అయ్యేలా చేస్తానని, పిల్లలు పుట్టని వారికి సంతానం కలిగేలా చేస్తానని, రోగాలు నయం చేస్తానని ప్రచారం చేసుకున్నాడు. అతడ్ని నమ్మి వచ్చిన వారిని బాగా కొట్టేవాడు. ఆడ,మగ అన్న తేడా లేకుండా అందరితో దారుణంగా ప్రవర్తించేవాడు. వాళ్ల చెప్పులు, షూలను నోట్లో పెట్టుకోమని చెప్పేవాడు.
కొన్ని సార్లు చెట్ల ఆకుల్ని ఇచ్చి తినమనే వాడు. అలా చేస్తే రోగాలు నయం అవుతాయని చెప్పేవాడు. అంతేకాదు.. తన దగ్గరి వచ్చే వాళ్లతో యూరిన్‌ను తాగించేవాడు. యాంటీ సూపర్‌స్టిషన్ ఆర్గనైజేషన్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో బాబా మహిళ గొంతును కాలితో తొక్కుతూ ఉన్నాడు. మరో వీడియోలో మహిళను కర్రతో కొడుతున్నాడు. ఈ వీడియోలు పోలీసు అధికారుల దృష్టికి వెళ్లాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
పోకిరీకి గట్టిగా బుద్ధి చెప్పి బాలిక
జోక్ నిజమైంది.. ఓ ప్రాణం పోయింది..