Welfare Schemes: కూలీలు దొరకడం లేదు
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:42 AM
ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత సంక్షేమ పథకాల కారణంగా భవన నిర్మాణ కార్మికులు తాము ఉన్న ప్రాంతం వదిలి పనుల కోసం వలసలు పోవడానికి ఇష్టపడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల కూలీలను సమకూర్చుకోవడం కష్టంగా మారిందన్నారు.

ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో
ఉన్నచోటు వదిలి రావడానికి ఇష్టపడటం లేదు
దీంతో భవన నిర్మాణ కూలీలకు తీవ్ర కొరత
ఎల్‌అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణియన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: వారానికి 90 గంటలు పనిచేయాలంటూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎల్‌అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణియన్, తాజాగా మరోసారి చర్చలోకి వచ్చారు. ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత సంక్షేమ పథకాల కారణంగా భవన నిర్మాణ కార్మికులు తాము ఉన్న ప్రాంతం వదిలి పనుల కోసం వలసలు పోవడానికి ఇష్టపడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల కూలీలను సమకూర్చుకోవడం కష్టంగా మారిందన్నారు. మంగళవారం మైసూరులో జరిగిన సీఐఐ సదస్సులో సుబ్రహ్మణియన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కూలీల వలసలకు ఉపాధి హామీ పథకం, జన్‌ధన్ వంటి పథకాలు అడ్డుగా ఉన్నాయని సుబ్రహ్మణియన్ అన్నారు. ‘‘కొత్త అవకాశాల దిశగా అడుగులు వేసేందుకు భవన నిర్మాణ కార్మికులు సిద్ధపడటం లేదు. బహుశా స్థానికంగా వారి ఆర్థిక పరిస్థితి బాగుండటం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు దీనికి కారణం కావచ్చు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక మంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూలి భత్యాలను సవరించాలన్న ఆయన.. ఇక్కడ కంటే మూడు నుంచి మూడున్నర రెట్లు ఎక్కువ భత్యం ఇచ్చి పశ్చిమాసియా దేశాలు మన కార్మిక శక్తిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News