Justice Chandrachud: నేటి అవసరాలకు తగ్గట్టుగా లేని న్యాయవిద్య
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:17 AM
దేశంలో న్యాయవిద్య 21వ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
డిజిటల్ రంగంపై దృష్టి పెట్టాలి: జస్టిస్ చంద్రచూడ్
ఛత్రపతి శంభాజీనగర్, ఆగస్టు 10: దేశంలో న్యాయవిద్య 21వ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ విప్లవం నేథ్యంలో డాటా ప్రొటెక్షన్, వాతావరణ మార్పులు, ఆన్‌లైన్‌లో వివాదాల పరిష్కారం వంటి అంశాల్లో నైపుణ్యాలు తగినంతగా లేవని తెలిపారు. అందువల్ల న్యాయవాదులు పలు రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాల్సి ఉంటుందని చెప్పారు. బోధన కూడా అందుకు అనుగుణంగా ఉండాలని సూచించారు. శనివారం ఇక్కడ విష్ణుపంత్ అద్వంత్ స్మారక ఉపన్యాసంలో భాగంగా ‘న్యాయ వృత్తి: వర్తమానం, భవిష్యత్తు; అవకాశాలు, సవాళ్లు, లోపాలు’ అనే ఆంశంపై ఆయన ప్రసంగించారు. న్యాయ విద్యా సంస్థలు అద్భుతమైన న్యాయ నిపుణులను అందిస్తున్నాయని, కానీ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఎదగడం లేదని చెప్పారు.