Share News

Hafiz: లష్కర్-ఇ-తోయిబా హఫీజ్ పిచ్చి ప్రేలాపన

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:42 PM

పాకిస్థాన్ బేస్డ్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ ముహమ్మద్ సయీద్ కారుకూతలు కూశాడు. పీఎం మోదీ టార్గెట్ గా పిచ్చి ప్రేలాపనలు..

Hafiz: లష్కర్-ఇ-తోయిబా హఫీజ్ పిచ్చి ప్రేలాపన
Lashkar e Taiba Hafiz

Lashkar e Taiba Hafiz: పాకిస్థాన్ బేస్డ్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ ముహమ్మద్ సయీద్ కారుకూతలు కూశాడు. పీఎం మోదీ టార్గెట్ గా పిచ్చి ప్రేలాపనలు చేశాడు. సింధు జలాలను ఆపేస్తే, మీ ఊపిరాపేస్తామంటూ పరుష మాటలు మాట్లాడాడు. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి వెనుక కూడా 26/ 11 ముంబయి దాడుల మాస్టర్ మైండ్.. హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. హఫీజ్ ముహమ్మద్ సయీద్ (‬జననం 5 జూన్ 1950) పాకిస్తానీ తీవ్రవాది. లష్కర్-ఇ-తోయిబా (లష్కరే) వ్యవస్థాపకుడు. ఈ ఉగ్ర సంస్థ ప్రధానంగా పాకిస్తాన్ నుండి పనిచేస్తోంది.

లష్కరే తోయిబా విష సర్పానికి పుట్టిన పిల్ల పామే.. తహల్గాంలో కాల్పులు జరిపిన 'ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (టీఆర్‌ఎఫ్‌). 2019లోనే ఇది పుట్టింది. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్‌ సాజిద్‌ గుల్‌ సుప్రీం కమాండర్‌గా, చీఫ్‌ ఆపరేషనల్‌ కమాండర్‌గా బాసిత్‌ అహ్మద్‌ దార్‌ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కరే చీఫ్‌ హఫీజ్‌ సయ్యద్‌ కనుసన్నల్లోనే నడుస్తోంది. డిప్యూటీ హెడ్‌గా సైఫుల్లా వ్యవహరిస్తున్నారు. ఈ ఇ‍ద్దరూ పాక్‌ నుంచే ఎల్‌ఈటీ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. పాక్‌ సైన్యం, ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ISI) టీఆర్‌ఎఫ్‌ గ్రూపులకు సైద్ధాంతికపరమైన మద్దతు మాత్రమే కాదు.. అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్నాయని భారత గూఢచార సంస్థలు నిగ్గుతేల్చాయి.


ఇవి కూడా చదవండి

JS Chandramouli funeral: చంద్రమౌళి ముఖాన్ని చూసి తట్టుకోలేకపోయిన భార్య

Borugadda Anil Supreme Court: బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంలో చుక్కెదురు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 05:42 PM