Bihar elections: పెద్ద కొడుకును పార్టీ నుంచి బహిష్కరించిన లాలూ
ABN , Publish Date - May 26 , 2025 | 02:06 AM
లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను 6 ఏళ్లు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తేజ్ ప్రతాప్ చేసిన ఫేస్‌బుక్ పోస్టు హ్యాక్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్నా, మే 25: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై పార్టీ కార్యకలాపాల్లో, కుటుంబ వ్యవహారాల్లో తేజ్ ప్రతా్‌పకు ఎలాంటి పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు. కుటుంబ విలువలు, సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకుంటున్నందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని లాలూ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. తాను 12 ఏళ్లుగా అనుష్క యాదవ్ అనే మహిళతో రిలేషన్‌లో ఉన్నానని తెలుపుతూ తేజ్ ప్రతాప్ శనివారం తన ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఆ మరుసటి రోజే లాలూ అతడిపై బహిష్కరణ వేటు వేశారు. అయితే తన పోస్టుపై ఆదివారం ఉదయమే తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. ఆ పోస్టు తాను పెట్టింది కాదని, తన ఫేస్‌బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి