Share News

Pannu: కుంభమేళాను అడ్డుకుంటాం

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:13 AM

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నున్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

Pannu: కుంభమేళాను అడ్డుకుంటాం

న్యూఢిల్లీ, జనవరి 6: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నున్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రయాగరాజ్‌లో ఈ నెల 13నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాను అడ్డుకుంటామంటూ వీడియో విడుదల చేశాడు. ‘మహాకుంభ్‌ ప్రయాగరాజ్‌ 2025 యుద్ధ భూమిగా మారుతుంది’, ‘హిందుత్వ భావజాలాన్ని హత్య చేయండి,’ ‘ప్రయాగరాజ్‌, లఖ్‌నవూ విమానాశ్రయాల్లో ఖలిస్థాన్‌ జెండాలను ఎగురవేయండి’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ‘చలో ప్రయోగరాజ్‌’ అంటూ మద్దతుదార్లకు పిలుపునిచ్చాడు. కుంభమేళాను వ్యతిరేకిస్తూ పన్నున్‌ హెచ్చరికలు చేయడం పది రోజుల్లో ఇది రెండోసారి. కుంభమేళాలో ముఖ్య రోజులైన సంక్రాంతి(జనవరి 14), మౌని అమావాస్య(జనవరి 29), బసంత పంచమి(ఫిబ్రవరి 3)న ఆటంకాలు కలిగిస్తామని మొదట హెచ్చరించాడు.

Updated Date - Jan 07 , 2025 | 05:13 AM