Share News

Pahalgam: 22 గంటలు ట్రెక్కింగ్‌ చేసొచ్చి ఘాతుకం

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:49 AM

పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు 20 నుంచి 22 గంటలపాటు ట్రెక్కింగ్‌ చేసి కోకెర్నాగ్‌ అడవి నుంచి బైరసన్‌ లోయ వరకు కాలినడకన చేరుకున్నారు. ఉగ్రదాడి సమయంలో రెండు సెల్‌ఫోన్లు చోరీ చేసినట్టు, వాటిలో ఒకటి స్థానికుడిది, మరొకటి పర్యాటకుడిది అని తెలిసింది.

Pahalgam: 22 గంటలు ట్రెక్కింగ్‌ చేసొచ్చి ఘాతుకం

కొండలు, గుట్టల్లో నడిచివచ్చి

పర్యాటకులను చంపిన ఉగ్రవాదులు

పహల్గాం, ఏప్రిల్‌ 27: పహల్గాం దాడిపై జరుగుతున్న దర్యాప్తులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. ఉగ్రవాదులు పహల్గాం చేరుకునేందుకు 20 నుంచి 22 గంటలపాటు ట్రెక్కింగ్‌ చేసినట్టు సమాచారం. ఉగ్రవాదులు తమ ప్రణాళికను అమలు చేసేందుకు కోకెర్నాగ్‌ అడవి నుంచి బైరసన్‌ లోయ వరకు కాలినడకన వచ్చినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతేకాక, దాడి సమయంలో ఉగ్రవాదులు రెండు సెల్‌ఫోన్లు కూడా చోరీ చేసినట్టు తెలిసింది. ఇందులో ఒకటి స్థానికుడిది కాగా మరొకటి పర్యాటకునిది. ఇక, స్థానిక ఉగ్రవాది అదీల్‌ థోకర్‌, ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు మొత్తం నలుగురు ఈ దాడిలో పాల్గొన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు ఏకే47, ఎం4 ఎసాల్ట్‌ రైఫిల్‌లతో మారణహోమానికి పాల్పడినట్టు ఫోరెన్సిక్‌ విశ్లేషణలో తేలింది.


ఇవి కూడా చదవండి:

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా

Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు

Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 04:49 AM