Kerala: జోర్డాన్ సైన్యం చంపిన కేరళ వాసి..
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:16 AM
నెలకు రూ. 3.5 లక్షల జీతం ఇస్తామని ఆశ చూపి అతడిని, మరొకరిని ఓ ఏజెంట్ జోర్డాన్ తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. భారత్ నుంచి వెళ్లే ముందు థామస్ నుంచి రూ. 2లక్షలు, అనంతరం మరో రూ. 50 వేలు తీసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు.

జాబ్ స్కాం బాధితుడు!
న్యూఢిల్లీ, మార్చి 8: అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తూ జోర్డాన్ సైన్యం కాల్పుల్లో మృతిచెందిన కేరళవాసి థామస్ గెబ్రియేల్ జాబ్ స్కాం బాధితుడని అధికారులు తెలిపారు. నెలకు రూ. 3.5 లక్షల జీతం ఇస్తామని ఆశ చూపి అతడిని, మరొకరిని ఓ ఏజెంట్ జోర్డాన్ తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. భారత్ నుంచి వెళ్లే ముందు థామస్ నుంచి రూ. 2లక్షలు, అనంతరం మరో రూ. 50 వేలు తీసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. పర్యాటక వీసాపై జోర్డాన్ వెళ్లిన అనంతరం అక్కడ ఉద్యోగాలు లేవని ఇజ్రాయెల్‌లో మంచి జాబ్ దొరుకుతుందని థామ్‌సను ఏజెంట్ నమ్మించాడు. ఈ క్రమంలో గత నెల 10న జోర్డాన్ సరిహద్దు నుంచి అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో థామ్‌సపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ దాడిలో అతడు మృతి చెందాడు. అతడి బంధువు ఎడిసన్ చార్లెస్ గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ
PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..
Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.