Share News

Home Delivery of Alcohol: కేరళలో ఇంటికే మద్యం డెలివరీ

ABN , Publish Date - Aug 11 , 2025 | 03:28 AM

మందుబాబుల ఇంటికే మద్యాన్ని డెలివరీ చేసే దిశగా కేరళలో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

Home Delivery of Alcohol: కేరళలో ఇంటికే మద్యం డెలివరీ

  • రాష్ట్ర బేవరేజెస్‌ సంస్థ ప్రతిపాదన

తిరువనంతపురం, ఆగస్టు 10: మందుబాబుల ఇంటికే మద్యాన్ని డెలివరీ చేసే దిశగా కేరళలో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంటికే మద్యాన్ని సరఫరా చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆ రాష్ట్ర బేవరేజెస్‌ (మార్కెటింగ్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌) కార్పొరేషన్‌.. రాష్ట్ర ప్రభుత్వం ముందుంచుంది. దీనివల్ల మద్యం అమ్మకాలతో రాబడి పెరగడానికి, మద్యం విక్రయ దుకాణాల వద్ద రద్దీని తగ్గించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి రాష్ట్ర ఆబ్కారీ చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుంది.

Updated Date - Aug 11 , 2025 | 03:28 AM