Share News

Sahitya Akademi: కబుర్ల దేవత పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం

ABN , Publish Date - Jun 18 , 2025 | 08:18 PM

తెలుగులో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం వరించింది. ప్రసాద్ సూరి రచించిన 'మైరావణ' కు నవలా సాహిత్య పురస్కారం దక్కింది.

Sahitya Akademi: కబుర్ల దేవత పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం

న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ (Sahitya Akademi) ప్రతిష్ఠాత్మక బాలసాహిత్య, యువ పురస్కారాలు-2025 (Sahitya Akademi Awards 2025)ను బుధవారంనాడు ప్రకటించింది. తెలుగులో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ (Gangishetti Shivakumar) రచించిన 'కబుర్ల దేవత' (Kaburla Devata) పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం వరించింది. ప్రసాద్ సూరి(Prasad Suri)రచించిన 'మైరావణ' (Mairavana)కు నవలా సాహిత్య పురస్కారం దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ అద్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన బుధవారంనాడు సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశమై ఈ పురస్కారానికి ఎంపికైన పుస్తకాల పేర్లను ప్రకటించింది.


ఈ ఏడాది 24 భాషల్లో ప్రచురితమైన రచనలు అవార్డులకు పోటీ పడ్డాయి. వీటిలో అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ,నేపాలీ, ఒడియా, పంజాబీ, రాజస్థానీ, సంస్కృతం, సంతాలి, సింధి, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల రచనలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారం ప్రకటించలేదు. దీంతో 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే యువ పురస్కారాలు ప్రకటించారు.


బాల సాహిత్య పురస్కారాలకు కన్నెగంటి అనసూయ, డాక్టర్ ఎం.భూపాల్ రెడ్డి, కిలపర్తి దాలినాయుడు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. యువ పురస్కారాలకు జీఎస్ చలం, కుప్పిలి పద్మ,పెద్దింటి అశోక్ కుమార్‌లు జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. పురస్కార విజేతలకు ఢిల్లీలో అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు కింద రూ.50 వేల నగదు, జ్ఞాపిక అందజేస్తారు.


ఇవి కూడా చదవండి..

అగ్నిపర్వతం బద్దలవడంతో వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి

For More National News

Updated Date - Jun 18 , 2025 | 08:19 PM