Share News

Karnataka politics: రాజీనామాకు సిద్ధం

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:31 AM

తుమకూరులో ఆదివారం కార్యకర్తలను ఉద్దేశించి హోం మంత్రి మాట్లాడుతూ.. ‘మీరు పెద్ద మనసుతో నా రాజీనామా కోరితే అందుకు సిద్ధమన్నా’రు. ఇటీవల నియోజకవర్గంలో కార్యకర్తలు,

Karnataka politics: రాజీనామాకు సిద్ధం

బెంగళూరు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంశం చర్చకు వస్తున్న తరుణంలోనే కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్‌ సంచలన ప్రకటన చేశారు. తుమకూరులో ఆదివారం కార్యకర్తలను ఉద్దేశించి హోం మంత్రి మాట్లాడుతూ.. ‘మీరు పెద్ద మనసుతో నా రాజీనామా కోరితే అందుకు సిద్ధమన్నా’రు. ఇటీవల నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలతో తగిన సమయం కేటాయించేందుకు సాధ్యం కావడం లేదన్నారు. ఇందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు. ‘మీరు కోరితే హోం మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అన్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి వచ్చిన పరమేశ్వర్‌ కీలకమైన హోం మంత్రి పదవికి రాజీనామా చేస్తాననడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2025 | 05:32 AM