Share News

K. Lakshman Appointed: పీఎసీ రైల్వేల ఉప కమిటీ కన్వీనర్‌గా కె.లక్ష్మణ్‌

ABN , Publish Date - Oct 11 , 2025 | 06:31 AM

పార్లమెంట్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఆధ్వర్యంలో వివిధ విభాగాలపై అధ్యయనం చేసేందుకు 6 ఉపకమిటీలను లోక్‌సభ సచివాలయం ఏర్పాటు చేసింది.....

K. Lakshman Appointed: పీఎసీ రైల్వేల ఉప కమిటీ కన్వీనర్‌గా కె.లక్ష్మణ్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఆధ్వర్యంలో వివిధ విభాగాలపై అధ్యయనం చేసేందుకు 6 ఉపకమిటీలను లోక్‌సభ సచివాలయం ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్థిక, రక్షణ, రైల్వేకు చెందినవి ఉన్నాయి. రైల్వేల ఉప కమిటీకి బీజేపీ రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్‌ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఆర్థిక వ్యవహారాల ఉప కమిటీకి టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్‌ కన్వీనర్‌గా ఉండగా ఈ ప్యానెల్‌లో తెలుగు ఎంపీలు సీఎం రమేశ్‌, శ్రీనివాసులురెడ్డి, బాలశౌరి సభ్యులుగా ఉన్నారు. రక్షణ వ్యవహారాల ఉప కమిటీకి ఒడిశా ఎంపీ అపరాజిత సారంగి కన్వీనర్‌గా, సీఎం రమేశ్‌ సహ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఇందులో బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి సభ్యులుగా ఉన్నారు. సివిల్‌-టూ ఉపకమిటీలో కె.లక్ష్మణ్‌ సభ్యులుగా ఉన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 02:39 PM