Share News

Jyoti Malhotra: చైనాలో భారత్ పరువు తీసింది.. జ్యోతి మల్హోత్రా ప్రవర్తన చూస్తే సిగ్గుపడాల్సిందే..

ABN , Publish Date - May 20 , 2025 | 05:02 PM

ట్రావెల్ వ్లాగర్ అయిన జ్యోతి భారత్‌లోనే కాదు.. విదేశాల్లో కూడా పలు వీడియోలను రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె గతేడాది చైనాను సందర్శించింది. చైనా పర్యటనలో జ్యోతి మల్హోత్రా ప్రవర్తన, ఆమె రూపొందించిన వీడియోలు అప్పట్లో తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి.

Jyoti Malhotra: చైనాలో భారత్ పరువు తీసింది.. జ్యోతి మల్హోత్రా ప్రవర్తన చూస్తే సిగ్గుపడాల్సిందే..
Jyoti Malhotra China video

పాకిస్థాన్‌ (Pakisthan)కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన భారత ఇన్‌ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)కు సంబంధించి రకరకాల వీడియోలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న జ్యోతికి సంబంధించిన పాత వీడియోలు ప్రస్తుతం మరింత వైరల్‌గా మారుతున్నాయి. ట్రావెల్ వ్లాగర్ అయిన జ్యోతి భారత్‌లోనే కాదు.. విదేశాల్లో కూడా పలు వీడియోలను రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె గతేడాది చైనా (China)ను సందర్శించింది.

jyothy2.jpg


చైనా పర్యటనలో జ్యోతి మల్హోత్రా ప్రవర్తన, ఆమె రూపొందించిన వీడియోలు అప్పట్లో తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. ఆ వీడియోలను చూసిన చాలా మంది రిపోర్ట్ కొట్టడంతో ఆమె వెంటనే క్షమాపణ కూడా చెప్పుకుంది. ఆ వీడియోలు చూస్తే చైనాలో జ్యోతి ఎంత పొగరుగా బిహేవ్ చేసిందో అర్థమవుతుంది. చైనా వీధుల్లో, రైళ్లలో తిరుగుతూ జ్యోతి వీడియోలు రూపొందించింది. ఆయా సమయాల్లో ఆమె స్థానికులతో వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. చైనీయులు ఆమెను తిట్టుకున్నారు.


హై స్పీడ్ రైలు ఎక్కి విండో సీట్ కోసం ఓ ప్రయాణికుడిని అడగడం, స్కూటీ మీద వెళ్తున్న మహిళతో వాగ్వాదం, బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించడం, టికెట్ అడిగిన డ్రైవర్‌తో గొడవ, మాండరిన్ భాషను విమర్శించడం, చైనా వారిని బాడీ షేమింగ్ చేయడం, వారు వాడుతున్న ఫోన్లను గేలి చేయడం మొదలైన ఎన్నో పనులు జ్యోతి చేసింది. దీంతో చైనీయులు ఆమెను తిట్టుకున్నారు. ఆమె ప్రవర్తన కారణంగా కొందరు ఇండియాను కూడా విమర్శించారు. ఆమె క్షమాపణ కోరుతూ మరో వీడియోను రూపొందించినా చైనీయులు ఆమెను క్షమించలేదు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 05:02 PM