Share News

Supreme Court Judges: సుప్రీం న్యాయమూర్తులుగా జస్టిస్‌ అరాధే, జస్టిస్‌ పంచోలీ ప్రమాణం

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:26 AM

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ విపుల్‌ పంచోలీ శుక్రవారం ప్రమాణం చేశారు..

Supreme Court Judges: సుప్రీం న్యాయమూర్తులుగా జస్టిస్‌ అరాధే, జస్టిస్‌ పంచోలీ ప్రమాణం

న్యూఢిల్లీ, ఆగస్టు 29: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ విపుల్‌ పంచోలీ శుక్రవారం ప్రమాణం చేశారు. సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. దాంతో సుప్రీంకోర్టు తన పూర్తి బలం 34 మందికి చేరుకుంది. ఈ నెల 27న వారిద్దరి నియామకాన్ని కేంద్రం ఖరారు చేసింది. జస్టిస్‌ పంచోలీ సీనియారిటీ ప్రకారం 2031 అక్టోబరు 3 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. 2033 మే 27 వరకు సీజేఐగా కొనసాగుతారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 03:26 AM