Share News

Justice Surya Kant: మా జడ్జీల తోలు మందం

ABN , Publish Date - Apr 23 , 2025 | 03:33 AM

న్యాయమూర్తులపై విమర్శలు రోజువారీగా మారిన నేపథ్యంలో, కోర్టులు వాటిని పెద్దగా పట్టించుకోవని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థపై దాడుల్ని తాము సహజంగానే స్వీకరిస్తామన్నారు.

Justice Surya Kant: మా జడ్జీల తోలు మందం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: ‘‘న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై దాడి సాధారణంగా మారిపోయింది. రోజూ ఇలాంటివి జరుగుతున్నాయి. మా న్యాయమూర్తులకు కాస్త తోలు మందం. కోర్టు ధిక్కరణ వంటి అంశాలను పెద్దగా పట్టించుకోరు’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. 2010 నాటి ఓ కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థపై ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే తదితరులు చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Updated Date - Apr 23 , 2025 | 03:33 AM