Ministry of Home Affairs: Mలేహ్ అల్లర్లపై దర్యాప్తునకు జస్టిస్ చౌహాన్ కమిషన్
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:08 AM
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని లేహ్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి....
న్యూఢిల్లీ, అక్టోబరు 17: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని లేహ్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎ్‌స.చౌహాన్ ఆధ్వర్యంలో కమిషన్‌ను నియమిస్తూ శుక్రవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 24న లేహ్‌లో జరిగిన అల్లర్లలో 1999నాటి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ జవాను సహా, నలుగురు మరణించారు. దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలని ఆందోళనకారులు డిమాండు చేస్తూ వస్తున్నారు. ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది.