BV Nagarathna: పంచోలీకి పదోన్నతిపై జస్టిస్ నాగరత్న అసమ్మతి
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:55 AM
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనుభాయి పంచోలీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం కొలీజియం తీసుకున్న నిర్ణయానికి సీనియర్ జస్టిస్...
న్యాయవ్యవస్థకు ప్రతికూల ఫలితాలనిస్తుందని వ్యాఖ్య
న్యూఢిల్లీ, ఆగస్టు 26: పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనుభాయి పంచోలీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం కొలీజియం తీసుకున్న నిర్ణయానికి సీనియర్ జస్టిస్ బీవీ నాగరత్న గట్టి అసమ్మతి తెలిపారు. కొలీజియం వ్యవస్థకున్న విశ్వసనీయతను జస్టిస్ పంచోలీ నియామకం దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. పట్నా, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పంచోలీ, అలోక్ అరాధేలకు పదోన్నతి కల్పిస్తూ సోమవారం సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యుల కొలీజియంలో 4:1 తేడాతో పంచోలీ నియామకానికి ఆమోదం తెలిపిందని మీడియాలో వార్తలొచ్చాయి. జస్టిస్ పంచోలీకి పదోన్నతి కల్పన వల్ల న్యాయం జరుగదని జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నట్లు సమాచారం. గత మే నెలలోనూ జస్టిస్ పంచోలీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడూ జస్టిస్ నాగరత్న అసమ్మతి తెలిపినప్పుడు.. జస్టిస్ ఎన్‌వీ అంజారియాను కొలీజియం ఎంపిక చేసింది. 3 నెలల తర్వాత మళ్లీ కొలీజియం జస్టిస్ పంచోలీ పేరును ముందుకు తేవడంతో ఆమె తీవ్రమైన అసమ్మతి నోటు రాశారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News