Stampede: హథ్రాస్ తొక్కిసలాటలో భోలే బాబాకు క్లీన్ చిట్
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:20 AM
ఉత్తరప్రదేశ్‌లోని హథ్రా్‌సలో జరిగిన తొక్కిసలాటతో భోలే బాబాకు ఎలాంటి సంబంధం లేదంటూ న్యాయ విచారణ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందుకు కార్యక్రమ నిర్వాహకులు, స్థానిక అధికారులు, పోలీసులదే బాధ్యత అని తెలిపింది.
లఖ్‌నవూ, ఫిబ్రవరి 21: ఉత్తరప్రదేశ్‌లోని హథ్రా్‌సలో జరిగిన తొక్కిసలాటతో భోలే బాబాకు ఎలాంటి సంబంధం లేదంటూ న్యాయ విచారణ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందుకు కార్యక్రమ నిర్వాహకులు, స్థానిక అధికారులు, పోలీసులదే బాధ్యత అని తెలిపింది. గత ఏడాది జులై రెండో తేదీన విశ్వ హరి భోలే బాబా పాల్గొన్న సత్సంగ్‌లో తొక్కిసలాట జరగడంతో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ జరిపిన జ్యుడీషియల్ కమిషన్.. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయని నిర్వాహకులదే తప్పని తేల్చింది.