Share News

Operation Sindoor: అప్పుడే ఇళ్లకు రాకండి.. సరిహద్దు గ్రామ ప్రజలకు కీలక సూచన

ABN , Publish Date - May 11 , 2025 | 05:13 PM

భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇరు దేశాల మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడకి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్‌పై దాడులకు దిగిన సంగతి తెలిసిందే.

Operation Sindoor: అప్పుడే ఇళ్లకు రాకండి.. సరిహద్దు గ్రామ ప్రజలకు కీలక సూచన
Border

భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇరు దేశాల మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడకి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్.. పాకిస్తాన్‌ (Pakistan)పై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ కూడా డ్రోన్లతో సరిహద్దు గ్రామాల పై దాడికి దిగింది (Operation Sindoor).


ఈ దాడుల నేపథ్యంలో జమ్ము, కశ్మీర్‌లోని బారాముల్లా, బందిపొరా, కుప్వారా జిల్లాల్లోని సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్న గ్రామాలకు చెందిన దాదాపు 1.25 లక్షల మందిని భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడే ఇళ్లకు తిరిగి రావొద్దని ఆ ప్రజలకు జమ్ము, కశ్మీర్ పోలీసులు సూచనలు చేశారు. వెంటనే వస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు.


పాక్ డ్రోన్ దాడుల కారణంగా సరిహద్దు గ్రామాల్లో చాలా ఫిరంగి గుళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి బాంబు నిర్వీర్య బృందాలను ఆయా గ్రామాలకు పంపి ఆ ఫిరంగులను నిర్వీర్యం చేస్తామని, అందువల్ల ఇప్పుడే ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళ్లొద్దని పోలీసులు సూచించారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 11 , 2025 | 05:13 PM