Share News

JEE Main: జేఈఈ మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డుల విడుదల

ABN , Publish Date - Jan 19 , 2025 | 03:49 AM

దేశంలోని ఐఐటీల్లో ప్రవేశం కోసం జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) మెయిన్‌ పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) శనివారం విడుదల చేసింది.

JEE Main: జేఈఈ మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డుల విడుదల

22 నుంచి 24 వరకు మొదటి దశ పరీక్షలు

హైదరాబాద్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): దేశంలోని ఐఐటీల్లో ప్రవేశం కోసం జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) మెయిన్‌ పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) శనివారం విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి జరగనున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ పరీక్షలు ఈ నెల 22 నుంచి 24 వరకు, రెండో దశ పరీక్షలు 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రస్తుతం మొదటి దశ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. రోజూ రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 15 పట్టణాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

Updated Date - Jan 19 , 2025 | 03:49 AM