Share News

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. రెండు నెలల తర్వాత..

ABN , Publish Date - Jun 15 , 2025 | 08:47 AM

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే..

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. రెండు నెలల తర్వాత..
Jammu and Kashmir

Pahalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రవాద దాడి యావత్ భారత్‌ను ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసరన్ గడ్డి మైదానంలో ఆహ్లాదంగా గడుపుతున్న పర్యాటకులపై టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం పురుషులే లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ ఉన్మాదంతో ఎంతో మంది మహిళలు తమ పసుపు కుంకుమ లకు దూరమయ్యారు. అయితే, ఈ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసి ఉగ్రవాదులను చావుదెబ్బ కొట్టింది.

ఇదిలాఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. పహల్గామ్, చుట్టుపక్కల ప్రాంతాలలో పర్యాటకుల రాకపోకలు తగ్గిపోయాయి. అక్కడికి వెళ్లాలంటనే ప్రజలు అమ్మో.. అంటూ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు. అక్కడి తోటలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా బంద్ చేశారు. అయితే, దాదాపు రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా అక్కడి పర్యాటక ప్రాంతాలను తెరవలేదు. ఉగ్రవాద దాడి కశ్మీర్ లోయలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. జమ్మూలోని మతపరమైన యాత్రలపై కూడా ప్రభావం చూపింది.


తాజాగా, ఈ విషయంపై జమ్మూ & కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. మూసివున్న పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరచుకోనున్నాయని ఆయన ట్వీట్ చేశారు. భద్రతా పరంగా తీసుకున్న ముందు జాగ్రత్తల కారణంగా తాత్కాలికంగా మూసిన జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని పర్యాటక ప్రదేశాలను జూన్ 17 నుంచి తిరిగి ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో పహల్గామ్ మార్కెట్, వెరినాగ్ గార్డెన్, కోకర్నాగ్ గార్డెన్, అచాబల్ గార్డెన్, బేతాబ్ వ్యాలీ, పార్కులు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తిరిగి నిలబెట్టేందుకు వివిధ చర్యలు తీసుకుంటోంది. గత నెలలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పహల్గామ్‌లో క్యాబినెట్ సమావేశానికి హాజరై, బేతాబ్ వ్యాలీ వంటి మూసివున్న ప్రాంతాలను సందర్శించారు.


Also Read:

అహ్మదాబాద్ టూ ప‌హ‌ల్గామ్ ఎటాక్ .. 6 నెలల్లో అనేక విషాదాలు..

విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు

For More National News

Updated Date - Jun 15 , 2025 | 09:49 AM