Share News

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రాజీ లేదు: జైశంకర్‌

ABN , Publish Date - May 11 , 2025 | 04:24 AM

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రాజీ లేదు: జైశంకర్‌

న్యూఢిల్లీ, మే 10 : ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘‘కాల్పులు, సైనిక చర్యను ఆపే విషయంలో భారత్‌, పాక్‌ ఈ రోజు ఓ అవగాహనకు వచ్చాయి.


ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా భారత్‌ అన్ని వేళలా రాజీలేని వైఖరిని కొనసాగించింది. ఇక మీదట కూడా అదే వైఖరి కొనసాగుతుంది’’ అని జైశంకర్‌ పోస్టు చేశారు.

Updated Date - May 11 , 2025 | 04:24 AM