LPG Truck Blast: పేలిన లారీ గ్యాస్ సిలిండర్లు, కిలో మీటర్ల మేర శబ్దాలు, మంటలు
ABN , Publish Date - Oct 08 , 2025 | 07:37 AM
ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ట్యాంకర్ ఢీకొనడంతో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అనేక మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మంటలు, పేలుళ్ల శబ్దాలు కిలోమీటర్ల దూరం నుండి కనిపించాయి. వినిపించాయి.
ఇంటర్నెట్ డెస్క్: జైపూర్-అజ్మీర్ హైవేపై ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ట్యాంకర్ ఢీకొనడంతో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందని, ట్రక్కు మంటల్లో చిక్కుకుందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో అనేక గ్యాస్ సిలిండర్లు పేలడంతో అక్కడంతా భీతావహ వాతావరణం నెలకొంది. కొన్ని పేలిన సిలిండర్లు ఘటనా స్థలం నుండి అనేక మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మంటలు, పేలుళ్ల శబ్దాలు అనేక కిలోమీటర్ల దూరం నుండి కనిపించాయి. వినిపించాయి. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌తో సహా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని జైపూర్ ఐజి రాహుల్ ప్రకాష్ తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఢీ కొట్టిన ట్యాంకర్ వాహనం డ్రైవర్‌ను ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు జైపూర్-ఐ సిఎంహెచ్‌ఓ రవి షెఖావత్ తెలిపారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా, పరిస్థితి అదుపులో ఉందని, ఇంకా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. డూడు ప్రాంతానికి సమీపంలోని పోలీసు అధికారులు, అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హైవేపై ట్రాఫిక్ నిలిపివేశారు.