New Tax Deduction: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. IT శ్లాబ్ పరిమితి పెంపు
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:22 PM
ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
New tax Deduction: : ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
కొత్త ఐటీ శ్లాబు
0-4 లక్షల వరకు నో ట్యాక్స్
4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5 శాతం
8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10 శాతం
12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15 శాతం
16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20 శాతం
20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25 శాతం
24 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి 30 శాతం బ్యాక్స్ ఉండనుంది.
సవరించిన స్లాబ్‌ల ప్రకారం, రూ. 4 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ. 4 నుంచి రూ. 8 లక్షల మధ్య వరకు ఆదాయం ఉన్నవారు ఐదు శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. రూ.8 నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 10 శాతంగా వరకు పన్ను కట్టాలి. రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 15 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 20 శాతం వరకు పన్ను కట్టాలి. రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య సంపాదించే వారు 25 శాతంగా వరకు పన్ను కట్టాలి. 24 లక్షలకు పైబడి ఉంటే అది 30 శాతం పన్ను కట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
ఇవన్నీ మధ్యతరగతిపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయని, ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారని సీతారామన్ అన్నారు. ఇది గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని కూడా పెంచుతుందని ఆమె చెప్పారు.