Share News

Arvind Kejriwal: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:12 AM

త్వరలో లూధియానాలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, మాన్‌ను తప్పించి... కేజ్రీవాల్‌ పంజాబ్‌ సీఎం అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్‌ సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది.

Arvind Kejriwal: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?

లూధియానా ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి11: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి కావాలని యోచిస్తున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలో లూధియానాలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, మాన్‌ను తప్పించి... కేజ్రీవాల్‌ పంజాబ్‌ సీఎం అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్‌ సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారని పైకి చెబుతున్నా కేజ్రీవాల్‌ మనసులో మాట పంజాబ్‌ సీఎం పదవేనని రాజకీయ వర్గాలంటున్నాయి. ఒకవేళ పంజాబ్‌ సీఎం పదవి కాదనుకున్న పక్షంలో పార్టీని కాపాడుకునే క్రమంలో కేజ్రీవాల్‌ రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశముంది. ఆప్‌నకు 10 మంది రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు లోక్‌సభ ఎంపీలున్నారు. పంజాబ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సందీప్‌ పాఠక్‌తో రాజీనామా చేయించి ఆయన స్థానంలో పోటీ చేసే అవకాశముంది.

Updated Date - Feb 12 , 2025 | 05:13 AM