Flight Cancellation: ఎల్లుండి వరకు ఇండిగో ఢిల్లీ సర్వీసులు రద్దు
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:41 AM
దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం, విజయవాడలకు వేర్వేరుగా నడిచే ఇండిగో విమాన సేవలను ఈ నెల 11 వరకు రద్దు చేస్తున్నట్టు
గన్నవరం/రాజమహేంద్రవరం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం, విజయవాడలకు వేర్వేరుగా నడిచే ఇండిగో విమాన సేవలను ఈ నెల 11 వరకు రద్దు చేస్తున్నట్టు విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాల డైరెక్టర్లు తెలిపారు. ప్రతి రోజు ఢిల్లీ నుంచి విజయవాడకు మధ్యాహ్నం 2.20 గంటలకు వచ్చి తిరిగి 2.50కి తిరిగి వెళుతుంది. రాజమహేంద్రవరం-న్యూఢిల్లీ మధ్య నడిచే విమాన సర్వీసును కూడా ఈ నెల 11 వరకు రద్దు చేసినట్టు డైరెక్టర్ తెలిపారు. 12వ తేదీ నుంచి తిరిగి రాకపోకలు కొనసాగనున్నాయని చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రోజూ 850మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా.. ప్రస్తుతం ఇండిగో సంక్షోభం వల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ఈ విమానాశ్రయం నుంచి మొత్తం 11 విమాన సర్వీసుల్లో ప్రయాణికులు ముంబయి, న్యూఢిల్లీ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నైకు రాకపోకలు సాగిస్తుంటారు.