Share News

2026 సెప్టెంబరు నాటికి పీఎఫ్‌బీఆర్‌ ప్లాంట్‌ రెడీ

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:39 AM

తమిళనాడులోని కల్పాక్కంలో సిద్ధమవుతున్న భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్‌ ఫాస్ట్‌-బ్రీడర్‌ రియాక్టర్‌ (పీఎ్‌ఫబీఆర్‌) వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి అందుబాటులోకి రానుంది.

2026 సెప్టెంబరు నాటికి పీఎఫ్‌బీఆర్‌ ప్లాంట్‌ రెడీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: తమిళనాడులోని కల్పాక్కంలో సిద్ధమవుతున్న భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్‌ ఫాస్ట్‌-బ్రీడర్‌ రియాక్టర్‌ (పీఎ్‌ఫబీఆర్‌) వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి అందుబాటులోకి రానుంది. అణుశక్తి నియంత్రణ మండలి (ఏఈఆర్‌బీ) నుంచి అనుమతి లభించిన దాదాపు రెండేళ్ల తర్వాత.. దీన్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. భారత అణుశక్తి లక్ష్యానికి ప్రోటోటైప్‌ ఫాస్ట్‌-బ్రీడర్‌ రియాక్టర్‌ చాలా ముఖ్యం.


ఇది అందుబాటులోకి వస్తే ఇంధన వనరులను సమర్థవంతంగా వాడుకోవచ్చు. అణు వ్యర్థాలను తగ్గించవచ్చు. కల్పాక్కంలో ఏర్పాటుచేస్తున్న పీఎ్‌ఫబీఆర్‌.. ప్లూటోనియం ఆధారిత మిశ్రమ ఆక్సైడ్‌ను ఇంధనంగా, ద్రవ సోడియంను శీతలకారిగా ఉపయోగించే మొట్టమొదటి అణు రియాక్టర్‌.

Updated Date - Apr 20 , 2025 | 04:39 AM