Share News

H-1B visa: అమెరికాలో ఉద్యోగం పోతే ఇంటికి పోతాం..

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:51 AM

అమెరికా విధిస్తున్న నిబంధనలు హెచ్‌-1బీ వీసాలపై అక్కడ పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే నిర్దేశిత సమయంలో అమెరికాను వారు వీడాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

H-1B visa: అమెరికాలో ఉద్యోగం పోతే ఇంటికి పోతాం..

  • 45% హెచ్‌-1బీ భారతీయుల మనోగతం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: అమెరికా విధిస్తున్న నిబంధనలు హెచ్‌-1బీ వీసాలపై అక్కడ పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే నిర్దేశిత సమయంలో అమెరికాను వారు వీడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోతే ఎక్కడికి వెళ్తారు అనే దానిపై అజ్ఞాత కమ్యూనిటీ యాప్‌ బ్లైండ్‌ సర్వేలో ప్రశ్నించగా.. భారత్‌కు తిరిగి వెళ్తామని 45ు మంది భారతీయ వృత్తినిపుణులు తేల్చి చెప్పేశారు. మరో దేశానికి వెళ్తామని 26 శాతం మంది పేర్కొన్నారు.


ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని 29 శాతం మంది చెప్పారు. ఇక అమెరికాను విడిచివెళ్లడానికి చెబుతున్న ప్రధాన ఆందోళనల విషయానికి వస్తే.. జీతాల్లో కోతలు (25ు), నాణ్యత లేని జీవితం (24ు), సాంస్కృతిక లేదా కుటుంబ సర్దుబాట్లు (13ు), తక్కువ ఉద్యోగ అవకాశాలు (10ు) వంటివి ఉన్నాయి. మళ్లీ అమెరికా వర్క్‌ వీసాను ఎంచుకుంటారా అంటే.. కేవలం 35ు మంది మాత్రమే ఎంచుకుంటామన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 01:51 AM