Share News

Indian Navy Strikes Karachi: కరాచీపై భారత నేవీ దాడులు

ABN , Publish Date - May 09 , 2025 | 12:17 AM

Indian Navy Attacks Karachi పాక్‌కు కీలకమైన కరాచీ నగరాన్ని టార్గెట్ చేసుకున్న భారతీయ నేవీ

Indian Navy Strikes Karachi: కరాచీపై భారత నేవీ దాడులు
Indian Navy strikes Karachi

పాక్ గగనతల దాడులను తిప్పికొట్టిన భారత్ ప్రస్తుతం దయాది దేశంలోని కరాచీ నగరాన్ని టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. భారత నావికాదళం కరాచీ నగరంపై దాడి ప్రారంభించినట్టు తెలుస్తోంది. 1971 తరువాత కరాచీపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఆయువుపట్టు లాంటి కరాచీని టార్గెట్ చేయడంతో పాక్‌కు షాక్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే భారత్ లాహోర్‌లోని పలు సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుంది. పెషావర్‌లో కూడా భారీ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఇక పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గగనతల నిఘా విమానం ఏవాక్‌ను కూడా భారత్ కూల్చివేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో పాక్ గగనతల దాడులను పూర్తిగా తిప్పికొట్టినట్టు భారత వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడుల్లో ఎవరికీీ అపాయం కలగలేదని పేర్కొన్నాయి.

Updated Date - May 09 , 2025 | 12:23 AM