Share News

Indian Man Killed: కేరళ వ్యక్తిని కాల్చి చంపిన జోర్డాన్‌ సైన్యం

ABN , Publish Date - Mar 04 , 2025 | 05:58 AM

ఈ దాడిలో మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 10న జరిగింది. ఈ మేరకు జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది. మరణించిన వ్యక్తిని కేరళకు చెందిన 47 ఏళ్ల థామస్‌ గెబ్రియేల్‌ పెరెరాగా గుర్తించారు.

Indian Man Killed: కేరళ వ్యక్తిని కాల్చి చంపిన జోర్డాన్‌ సైన్యం

న్యూఢిల్లీ, మార్చి 3: జోర్డాన్‌ సైన్యం ఓ భారతీయుడిని కాల్చి చంపింది. జోర్డాన్‌ సరిహద్దు నుంచి అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అతడిపై కాల్పులు జరిపింది. ఈ దాడిలో మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 10న జరిగింది. ఈ మేరకు జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది. మరణించిన వ్యక్తిని కేరళకు చెందిన 47 ఏళ్ల థామస్‌ గెబ్రియేల్‌ పెరెరాగా గుర్తించారు. థామస్‌ పర్యాటక వీసాపై ఫిబ్రవరి మొదటివారంలో జోర్డాన్‌ వెళ్లాడు. అక్కడి నుంచి అతని బంధువు ఎడిసన్‌తో కలిసి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో థామ్‌సను ఆపేందుకు జోర్డాన్‌ జవాన్లు యత్నించినా అతడు వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పు జరిపారని థామస్‌ కుటుంబసభ్యులకు భారత రాయబార కార్యాలయం ఈమెయిల్‌ లో సందేశం పంపింది.

Updated Date - Mar 04 , 2025 | 05:59 AM