Indian Air Force: రెక్కలు విరిగిన పాకిస్థాన్
ABN , Publish Date - May 14 , 2025 | 06:09 AM
భారత వైమానిక దళం ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌లోని 11 వైమానిక స్థావరాలు సహా పలు సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. సరికొత్త హైరిజొల్యూషన్ శాటిలైట్ చిత్రాలు ఈ ధ్వంసాన్ని బాగా ప్రతిబింబించాయి.
20% వైమానిక ఆస్తులు ధ్వంసం
న్యూఢిల్లీ, మే 13: భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో పాకిస్థాన్‌లోని 11 వైమానిక స్థావరాలు సహా పలు సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. పలు ఫైటర్ జెట్లు, మౌలికసదుపాయాలు కూడా నేలమట్టమయ్యాయి. వైమానిక స్థావరాల్లో ఎటు చూసినా లోతైన గుంతలు, ధ్వంసమైన హ్యాంగర్లు దర్శనమిచ్చాయి. దీంతో పాకిస్థాన్ రెక్కలు విరిగినట్లు అయింది. భారత్ జరిపిన దాడితో తమకేమీ పెద్దగా నష్టం కలగలేదని దాయాది దేశం బుకాయించే ప్రయత్నం చేసినా.. హైరిజొల్యూషన్ శాటిలైట్ ఫొటోలు మాత్రం ఊహకు సైతం అందని రీతిలో పాక్‌కు జరిగిన భారీ నష్టాన్ని కళ్లకు కట్టాయి. ఆపరేషన్ సిందూర్‌లో రావల్పిండిలోని నూర్ ఖాన్, సింధ్‌లోని సుక్కూర్, పంజాబ్‌లోని రహీం యార్ ఖాన్ మిలిటరీ స్థావరాలు ఽనాశనమయ్యాయి. అదేవిధంగా సర్గోదాలోని ముషాఫ్, ఉత్తర సింధు ప్రాంతంలోని షహ్‌బాజ్ జకోబాబాద్, ఉత్తర థట్టాలోని భొలారీ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అమెరికాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ ‘మాక్సర్ టెక్నాలజీస్’ విడుదల చేసిన హైరిజొల్యూషన్ చిత్రాలు ఈ ధ్వంసాన్ని కళ్లకు కట్టాయి. ఆపరేషన్ సిందూర్‌తో పాక్ వైమానిక స్థావరాల్లోని 20ు ఆస్తులు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఆయా వైమానిక స్థావరాల్లోని ఎఫ్-16, జేఎఫ్-17 యుద్ధ విమానాలు, ఆయుధాగారాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..