PM Modi: మా నీళ్లు ఇక మాకే
ABN , Publish Date - May 07 , 2025 | 05:37 AM
ప్రధాని మోదీ సింధు నది జలాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై భారత జలాలు దేశ ప్రయోజనాలకే మాత్రమే వినియోగించబడతాయని స్పష్టం చేశారు.
సింధు జలాలపై ప్రధాని మోదీ వ్యాఖ్య
న్యూఢిల్లీ, మే 6: ఇప్పటి వరకు ఇతరులకు ఇచ్చిన మన నీళ్లు ఇకపై మనకేనని ప్రధాని మోదీ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏబీపీ మీడియా గ్రూప్ మంగళవారం నిర్వహించిన కాంక్లేవ్‌లో మాట్లాడుతూ.. ఈమేరకు వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పొరుగు దేశం పేరు ఎత్తలేదు. ‘‘ఇక భారత జలాలు భారత్ కోసమే ప్రవహిస్తాయి... నిల్వ ఉంటాయి.. దేశ ప్రయోజనాలకే వినియోగమవుతాయి...’’ అని ప్రధాని మోదీ కాంక్లేవ్‌లో పేర్కొన్నారు. తద్వారా సింధు నది జలాల విషయంలో భారత్ అనుసరించనున్న వైఖరిని స్పష్టం చేశారు.