BrahMos A missile: బ్రహ్మోస్ క్షిపణుల కోసం మరో 20 సుఖోయ్ విమానాల అప్‌గ్రేడ్
ABN , Publish Date - May 18 , 2025 | 05:11 AM
పాక్, చైనాలకు తగిన బుద్ధి చెప్పేందుకు మోదీ ప్రభుత్వం కీలక ఆర్మీ నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోస్-ఏ క్షిపణులను మోసేందుకు మరో 20 సుఖోయ్ యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేయనుంది.
న్యూఢిల్లీ, మే 17: పాకిస్థాన్, చైనాలకు కంటిమీద నిద్ర లేకుండా చేసేందుకు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ వెన్ను విరవడంలో బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో బ్రహ్మో్‌స-ఏ క్షిపణులను మోసుకెళ్లేందుకు వీలుగా మరో 20 సుఖోయ్ యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో బ్రహ్మోస్-ఏ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం గల సుఖోయ్ యుద్ధ విమానాల సంఖ్య 60కి చేరుకుంటుంది. ఈ బాధ్యతను హెచ్‌ఎఎల్‌కి అప్పగించారు. ప్రస్తుతం 2.5-టన్నుల బ్రహ్మో్‌స-ఎ క్షిపణిని సుఖోయ్ విమానం మోసుకెళ్లగలుగుతుంది. ఇక నుంచి 2.8 టన్నుల బ్రహ్మోస్-ఎ క్షిపణిని 400 కి.మీలకు పైగా దూరంలోని లక్ష్యాన్ని ఢీకొట్టేలా సుఖోయ్ విమానాలను అభివృద్ధి చేస్తారు.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..