caller ID: త్వరలో ఇండియా అధికారిక కాలర్ ఐడీ
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:00 AM
గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండేందుకు చాలా మంది తమ మొబైల్ ఫోనుల్లో ట్రూకాలర్ వంటి...
కాలర్ అసలు పేరును మొబైల్ స్ర్కీన్‌పై చూపించే సీఎన్‌ఏపీ
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశ వ్యాప్తంగా అమలులోకి !
న్యూఢిల్లీ, అక్టోబరు 29: గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండేందుకు చాలా మంది తమ మొబైల్ ఫోనుల్లో ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లు వాడుతుంటారు. ఈ థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఆయా సేవలు పొందేందుకు వీలుగా.. కాలింగ్ నేమ్ ప్రజంటేషన్(సీఎన్‌ఏపీ) పేరిట భారతదేశ అధికారిక కాలర్ ఐడీ అందుబాటులోకి రాబోతుంది. మొబైల్‌కు ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు.. సదరు నంబరు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో ఆ పేరు మొబైల్ స్ర్కీన్‌పై కనిపించనుంది.
సీఎన్‌ఏపీ సేవలు తమకు వద్దు అనుకునే వారు తమ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి వాటిని నిలిపివేసుకోవచ్చు. ఈ సీఎన్‌ఏపీ అమలు కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డీఓటీ) చేసిన ప్రతిపాదనకు ట్రాయ్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ట్రాయ్ ఆమోదానికి వెళ్లే ముందు.. దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో సీఎన్‌ఏపీని డీఓటీ పరీక్షించింది. పలు సాంకేతిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై దృష్టిపెట్టింది. కాగా, 2026 మార్చి 31 నాటికి దేశ వ్యాప్తంగా సీఎన్‌ఏపీ సర్వీసును వినియోగదారులకు అందించాలని జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ తదితర టెలికామ్ ఆపరేటర్లను డీఓటీ ఇప్పటికే ఆదేశించింది. వోడాఫోన్ ఐడియా, జియో సంస్థలు హరియాణాలో సీఎన్‌ఏపీ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తున్నాయి.
ఇవీ చదవండి:
Indias IT Market: 2030 నాటికి రూ.35.32 లక్షల కోట్లు
Apples Market Value: యాపిల్ 4 లక్షల కోట్ల డాలర్లు