Pralay Missile: ప్రళయ్ క్షిపణి పరీక్షలు విజయవంతం
ABN , Publish Date - Jul 30 , 2025 | 06:20 AM
ప్రళయ్ క్షిపణి పరీక్షలు విజయవంతం సంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ
బాలాసోర్/న్యూఢిల్లీ, జూలై 29: ప్రళయ్ క్షిపణి పరీక్షలు విజయవంతం సంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ స్వల్పశ్రేణి మిస్సైల్‌కు సోమ, మంగళవారాల్లో ఒడిసా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో వరుస పరీక్షలు నిర్వహించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి 500 నుంచి 1000 కిలోల వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. ఇది 150- 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.