Share News

MEA: పశ్చిమాసియాలో ఘర్షణల పరిష్కారానికి భారత్ రెడీ

ABN , Publish Date - Jun 24 , 2025 | 09:31 PM

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా, ఖతర్ కీలక పాత్ర పోషించినట్టు వస్తున్న వార్తలను ఇండియా స్వాగతించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు.

MEA: పశ్చిమాసియాలో ఘర్షణల పరిష్కారానికి భారత్ రెడీ

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఘర్షణల పరిష్కారం దిశగా తమ వంతు కృషి చేసేందుకు సిద్ధమేనని భారత్ ప్రకటించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా, ఖతర్ కీలక పాత్ర పోషించినట్టు వస్తున్న వార్తలను స్వాగతించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. పశ్చిమాసియాలో ఘర్షణల పరిష్కరానికి చర్చలు, దౌత్య మార్గం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన తెలిపారు.


ఇరాన్ నుంచి 281 మంది భారతీయులు

కాగా, యుద్ధం కారణంగా ఇరాన్‌లో చిక్కుకుపోయిన 281 మంది భారతీయులతో మరో ప్రత్యేక విమానం మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుందని రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. వీరిలో ముగ్గురు శ్రీలంక జాతీయులు, ఇద్దరు నేపాలీ పౌరులు కూడా ఉన్నట్టు చెప్పారు. దీంతో ఆపరేషన్ సింధు కింద ఇంతవరకూ 2,576 మందిని వెనక్కి తీసుకువచ్చినట్టు వివరించారు.


పొరుగుదేశాలకు ఆపన్నహస్తం

అవసరంలో ఉన్న వారికి తగిన సాయం చేసేందుకు, పొరుగుదేశాలైన నేపాల్, శ్రీలంకకు కూడా స్నేహహస్తం అందించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిట తెలిపారు. ఇరాన్‌ను నుంచి ఇప్పటి వరకూ 11 బ్యాచ్‌ల్లో 2,576 మందిని ఇండియాకు తీసుకువచ్చామని చెప్పారు. ఇజ్రాయెల్ నుంచి 594 మంది భారతీయులను కూడా వెనక్కి తెచ్చామన్నారు.. దీంతో ఆపరేషన్ సింధు కింద ఇంతవరకూ 3,180 మంది భారతీయులు స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చామని వివరించారు.


ఇవి కూడా చదవండి..

అలా చేస్తే అసెంబ్లీ రద్దుకు రెడీ

మా వాళ్లను వేధిస్తున్నారు.. పీఎం దృష్టికి తీసుకువెళ్తా

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 09:34 PM