Post To Launch: పార్శిల్ బుక్ చేసిన 24 గంటల్లో ఇండియా పోస్టు డెలివరీ సేవలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:46 AM
భారత తపాలా శాఖ వచ్చే ఏడాది నుంచి తన వినియోగదారులకు 24 గంటల్లో బుక్ చేసిన పార్శిల్‌ను గమ్యస్థానానికి చేర్చనున్నది.
2026 జనవరి నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ, అక్టోబరు 17: భారత తపాలా శాఖ వచ్చే ఏడాది నుంచి తన వినియోగదారులకు 24 గంటల్లో బుక్ చేసిన పార్శిల్‌ను గమ్యస్థానానికి చేర్చనున్నది. కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం స్పందిస్తూ.. 2026 జనవరి నుంచి న్యూ సింగిల్ విండో స్పీడ్ డెలివరీ సర్వీసును ఇండియా పోస్టు అందుబాటులోకి తెస్తుందని చెప్పారు. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి నుంచి దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలు, రాష్ట్రాల రాజధానులకు 48 గంటల్లో లగేజీని ఇండియా పోస్టు డెలివరీ చేయనున్నది. 2026 మార్చి నుంచి దేశంలోని మారుమూల ప్రాంతాలకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థల సాయంతో డెలివరీ సర్వీసులందిస్తుంది. ప్రస్తుతం సంస్థ ఫాస్టెస్ట్ డెలివరీ సర్వీసు కింద బుక్ చేసిన 3, 5 రోజుల్లోపు గమ్యస్థానానికి చేరుకుంది.