Airports on High Alert: పాక్ దాడులు.. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్
ABN , Publish Date - May 08 , 2025 | 11:22 PM
పాక్ దాడులకు తెగ బడుతున్న నేపథ్యంలో భారత్‌లోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ దాడులకు తెగ బడుతున్న నేపథ్యంలో భారత్‌లోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పారామిలిటరీ దళాల డైరెక్టర్ జనరల్స్‌తో హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎయిర్‌పోర్టుల్లో కట్టుదిట్టమైన భద్రతల కొనసాగిస్తూ నిరంతరంగా అప్రమత్తత వహించాలని సీఐఎస్ఎఫ్ డీజీ ఆర్ఎస్ భట్టీకి సూచించారు. ఇక పాక్ దాడుల ముప్పు ఎక్కువగా ఉన్న శ్రీనగర్, చండీగఢ్, అమృత్‌సర్, లూథియానా, పాటియాలా, శిమ్లా తదితర ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులను మూసివేశారు.
పాక్‌తో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఎయిర్ ఇండియా ప్రయాణికులకు అత్యవసర సూచనలు జారీ చేసింది. విమానాల చెకిన్‌లు ప్రయాణ సమయానికి 75 నిమిషాల ముందే మూసేస్తారని పేర్కొంది. ప్రయాణ సమయానికి మూడు గంటలకు ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని ఆదేశించింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సూచన మేరకు ఎయిర్‌పోర్టుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ప్రయాణికులకు ఈ మేరకు ఎయిర్ ఇండియా సూచనలు జారీ చేసింది.