Home Secretary Emergency Meet: సరిహద్దు రాష్ట్రాల సెక్రెటరీలతో హోం సెక్రెటరీ సమావేశం
ABN , Publish Date - May 10 , 2025 | 11:38 PM
పాక్ కాల్పుల ఉల్లంఘన నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల సెక్రెటరీలతో హోం శాఖ సెక్రెటరీ సమావేశం నిర్వహించారు.
పాక్ కాల్పుల ఉల్లంఘన నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల సెక్రెటరీలతో హోం శాఖ సెక్రెటరీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. సివిల్ డిఫెన్స్ డీజీతో కూడా మాట్లాడిన హోం సెక్రెటరీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఇక చైనా విదేశాంగ శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తాము యుద్ధాన్ని ఆశించట్లేదని అన్నారు. అయితే, పాక్ ఉల్లంఘనలతో సైనికులు, పౌరులు కన్నుమూసిన నేపథ్యంలో ఉగ్రవాద ఏరివేత చర్యలు తప్పవని న్పష్టం చేశారు.