Share News

జీ-7 సదస్సుకు రావాలని మోదీకి కెనడా ప్రధాని ఆహ్వానం

ABN , Publish Date - Jun 07 , 2025 | 05:59 AM

జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందింది. కెనడా కొత్త ప్రధాని మార్క్‌ కెర్నీ ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు.

జీ-7 సదస్సుకు రావాలని మోదీకి కెనడా ప్రధాని ఆహ్వానం

న్యూఢిల్లీ, జూన్‌ 6: జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందింది. కెనడా కొత్త ప్రధాని మార్క్‌ కెర్నీ ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. కెనడాలో జరిగే జీ-7 సదస్సుకు హాజరవుతున్నానని ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా తెలిపారు. కొత్తగా ఎన్నికైన సందర్భంగా కెర్నీకి శుభాకాంక్షలు తెలిపారు.


కెర్నీతో సమావేశమయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ మోదీ పోస్ట్‌లో రాశారు. తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, అమెరికా, యూకే, జపాన్‌, కెనడా దేశాలు జీ-7గా ఏర్పడ్డాయి. ఈ నెల 15 నుంచి 17 వరకు కెనడాలోని ఆల్బెర్టాలో జీ-7 సదస్సు జరగనుంది.

Updated Date - Jun 07 , 2025 | 05:59 AM