వలసదారుల భద్రతకు కొత్త చట్టం!
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:49 AM
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల భద్రత కోసం కొత్త చట్టం తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. విదేశాల్లో ఉపాధి కోసం సురక్షితమైన, క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించేలా చట్టంలో విధివి ధానాలు రూపొందించాలని పరిశీలిస్తోంది. తాజాగా భారత్ కు చెందిన 104 మంది అక్రమ వలసదారులను అమెరికా

పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
విదేశాల్లో ఉపాధికి సురక్షిత వలసలను ప్రోత్సహించేలా చట్టంలో విధివిధానాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల భద్రత కోసం కొత్త చట్టం తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. విదేశాల్లో ఉపాధి కోసం సురక్షితమైన, క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించేలా చట్టంలో విధివి ధానాలు రూపొందించాలని పరిశీలిస్తోంది. తాజాగా భారత్ కు చెందిన 104 మంది అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపడంతో ఈ ప్రతిపాదన వచ్చింది. 1983 నాటి వలస చట్టం స్థానంలో కొత్త ప్రతిపాదిత చట్టం (ఓవర్సీస్ మొబిలిటీ బిల్లు-2024)తీసుకొచ్చే అంశం పరిశీలనలో ఉంది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సారథ్యంలోని విదేశీ వ్యవహారాల కమిటీ దీనిపై పార్లమెంటులో నివేదిక సమర్పించింది. వలస దారుల భద్రతను పర్యవేక్షించే(పీవోఈ) ఆఫీసులు లేని రా ష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చండీగఢ్, కోచి, తిరువనంతపురం, జైపూర్, పట్నా, రాయబరేలి, రాంచీ, గువహటిలలో 14 కార్యాలయాలు ఉ న్నాయని వెల్లడించింది. వలసలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అదనపు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించింది. వీసా నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించా ల్సిన అవసరముందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వలస లు పెరుగుతున్న నేపథ్యంలో భారత పౌరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1983 వలస చట్టం స్థానంలో సమగ్ర శాసన సవరణ అవసరమని కొన్నేళ్లుగా ప్రభుత్వానికి సూ చిస్తున్నట్టు కమిటీ పేర్కొంది. ప్రతిపాదిత ముసాయిదాపై సంబంధిత శాఖలతో చర్చించిన తర్వాత ప్రజాభిప్రాయం కోసం అందుబాటులో ఉంచనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ తెలియజేసిందని కమిటీ వెల్లడించింది.
ఓవర్సీస్ బిల్లుతో లాభాలు
మెరుగైన నిబంధనలు తేవడం ద్వారా అక్రమ నియా మకాలు, దోపిడీ, మోసాల నుంచి వలసదారులకు రక్షణ
వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వలసదారుల భద్రతా కార్యాలయాల విస్తరణ. తద్వారా సులభంగా చట్టపరమైన మార్గదర్శకత్వం, మద్దతు
పౌరసమాజం, మీడియా భాగస్వామ్యంతో వలసదారులకు హక్కులు, చట్టపరమైన విధానాలు, అక్రమ వలసలతో ఇబ్బందులపై అవగాహన
ఆధునికీకరణ వ్యవస్థ ద్వారా అధికారిక అడ్డంకుల్ని తొ లగించి, పద్ధతిప్రకారం వలస ప్రక్రియను పూర్తి చేయడం
ప్రపంచ వలస ధోరణులు, భారత పౌరుల అవసరాలకు అనుగుణంగా విస్తృతంగా చర్చించి బిల్లు రూపకల్పన