Fast Patrol Vessels: తీరప్రాంత గస్తీకి అజిత్ అపరాజిత్
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:25 AM
భారత తీరప్రాంత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా మరో కీలక ముందడుగు పడింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 24: భారత తీరప్రాంత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా మరో కీలక ముందడుగు పడింది. భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) కోసం గోవా షిప్‌యార్ట్ లిమిటెడ్ (జీఎ్‌సఎల్) నిర్మించిన రెండు అడ్వాన్స్‌డ్ ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకలు (ఎఫ్‌పీవీ) ‘ఐసీజీఎస్ అజిత్’, ‘ఐసీజీఎస్ అపరాజిత్’ శుక్రవారం ప్రారంభమయ్యాయి. తీరప్రాంత గస్తీ, మత్స్య సంపద సంరక్షణ, అక్రమ రవాణా నిరోధం, పైరసీ నిరోధంతోపాటు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించే సత్తా కలిగిన ఈ రెండు ఎఫ్‌పీవీలను గోవా షిప్‌యార్ట్ లిమిటెడ్‌లో ప్రారంభించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీజీ కోసం జీఎ్‌సఎల్ నిర్మించిన ఎనిమిది స్వదేశీ ఎఫ్‌పీవీల శ్రేణిలో ఇవి చివరి (ఏడు, ఎనిమిది) నౌకలని పేర్కొంది. వీటి చేరికతో తీరప్రాంత నిఘా, స్పందించే సామర్థ్యం పెరుగుతాయని వెల్లడించింది. 52 మీటర్ల పొడవు, 320 టన్నుల బరువు కలిగిన ఈ నౌకల్లో నియంత్రించదగిన పిచ్ ప్రొపల్లెంట్లు అమర్చినట్టు తెలిపింది.