Share News

Self Enumeration: జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం

ABN , Publish Date - Oct 18 , 2025 | 04:02 AM

జనగణన-2027 ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది.

Self Enumeration: జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం

న్యూఢిల్లీ, అక్టోబరు 17: జనగణన-2027 ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. పౌరులు ఈ ఏడాది నవంబరు 1 నుంచి 7 వరకు స్వీయ ఎన్యూమరేషన్‌ విండో ద్వారా తమ వ్యక్తిగత వివరాలను డిజిటల్‌గా సమర్పించవచ్చని ప్రకటించింది. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల తొలి దశకు సంబంధించి నవంబరు 10 నుంచి 30 మధ్య ముందస్తు కసరత్తు జరుగుతుందని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో హౌస్‌ లిస్టింగ్‌, హౌసింగ్‌ సెన్సస్‌ వంటివి జరుగుతాయని పేర్కొన్నారు. స్వీయ ఎన్యూమరేషన్‌ ఆప్షన్‌ నవంబరు 1-7 వరకు అందుబాటులో ఉంటుంది.

Updated Date - Oct 18 , 2025 | 04:02 AM