Labour Unions: రేపు భారత్ బంద్
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:57 AM
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ 10 కార్మిక సంఘాల వేదిక బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.
25 కోట్ల మంది పాల్గొంటారు: కార్మిక సంఘాలు
న్యూఢిల్లీ, జూలై 7: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ 10 కార్మిక సంఘాల వేదిక బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. మోదీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని కోరింది.
దేశవ్యాప్తంగా జరగనున్న ఈ సమ్మెలో బ్యాంకింగ్, బీమా, తపాలా, బొగ్గు గనులు, జాతీయ రహదారులు, నిర్మాణ రంగాలకు చెందిన 25 కోట్ల మందికి పైగా పాల్గొంటారని పేర్కొంది. దేశవ్యాప్తంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల్లోకి కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రె్‌సకు చెందిన అమర్జీత్ తెలిపారు.