Share News

భారత్‌-మారిష్‌స మధ్య 8 ఒప్పందాలు

ABN , Publish Date - Mar 13 , 2025 | 06:14 AM

భారత్‌-మారిష్‌స మధ్య వాణిజ్యం, తీరప్రాంత భద్రత తదితర అంశాలపై 8 కీలక ఒప్పందాలు కుదిరాయి.

భారత్‌-మారిష్‌స మధ్య 8 ఒప్పందాలు

పోర్ట్‌ లూయీ, మార్చి 12: భారత్‌-మారిష్‌స మధ్య వాణిజ్యం, తీరప్రాంత భద్రత తదితర అంశాలపై 8 కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలని తాను, మారిషస్‌ ప్రధాని నవీన్‌చంద్ర నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మారిషస్‌ జాతీయ దినోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఐఎన్‌ఎ్‌స ఇంఫాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


భారత వైమానిక దళానికి చెందిన స్కై డైవింగ్‌ బృందం కూడా వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా మోదీ దక్షిణార్థ గోళ దేశాల కోసం మహాసాగర్‌ పేరిట కొత్త విజన్‌ను ప్రకటించారు. మారిషస్‌ పార్లమెంట్‌ భవన నిర్మాణానికి భారత్‌ సహకరిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్‌ నుంచి మారిష్‌సకు దీన్ని కానుకగా మోదీ అభివర్ణించారు. పర్యటనలో భాగంగా మోదీకి మారిషస్‌ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని బహూకరించింది.

Updated Date - Mar 13 , 2025 | 06:14 AM