IIT Baba: ‘ఐఐటీ బాబా’పై గంజాయి కేసు
ABN , Publish Date - Mar 04 , 2025 | 05:54 AM
ఆయనపై మాదకద్రవ్యాలు, మానసిక వ్యసన పదార్థాల చట్టం (ఎన్‌డీపీఎస్) కింద కేసు నమోదు చేశారు. జైపూర్‌లోని ఓ హోటల్‌లో దిగిన అభయ్ సింగ్.. అక్కడ గొడవ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు..
రాజస్థాన్‌లో అరెస్టు చేసిన పోలీసులు
జైపూర్, మార్చి 3: మహాకుంభమేళా సమయంలో ‘ఐఐటీ బాబా’గా ప్రాచుర్యం పొందిన అభయ్ సింగ్‌ను గంజాయి కేసులో రాజస్థాన్‌లోని జైపూర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై మాదకద్రవ్యాలు, మానసిక వ్యసన పదార్థాల చట్టం (ఎన్‌డీపీఎస్) కింద కేసు నమోదు చేశారు. జైపూర్‌లోని ఓ హోటల్‌లో దిగిన అభయ్ సింగ్.. అక్కడ గొడవ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. అయన వద్ద నుంచి స్వల్ప మొత్తంలో గంజాయి స్వాఽధీనం చేసుకున్నారు. ఆయన వద్ద దొరికిన గంజాయి అనుమతించదగిన పరిమితిలోనే ఉండడంతో కొంత సేపు నిర్బంఽధం తర్వాత పోలీసులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల నిర్బంధం నుంచి బయటకొచ్చిన తర్వాత ఐఐటీ బాబా మీడియాతో మాట్లాడుతూ తన వద్ద దొరికింది ‘ప్రసాదం’ అని, కుంభ్‌లోని దాదాపు ప్రతి బాబా గంజాయిని ప్రసాదంగా స్వీకరిస్తారని పేర్కొన్నారు.